Home » Health » హోలీ ఆడుతున్నప్పుడు కళ్లలో రంగు పడితే  ఏం చేయాలి?


 

 

హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే  ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం,  స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం  ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం ,  ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.  అయితే సింథటిక్ రంగులు,   ఆస్తమా,  శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం,  తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి  కారణాలకు దారి తీయవచ్చు.

హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే..

కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు,  హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి,  కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.  పొడి రంగులలో లేదా గులాల్‌లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

కంటి వైద్యులు ఏం చెప్తున్నారు..

హోలీ సమయంలో,  తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు  కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు,  మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ,  మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు,  అలెర్జీలకు కారణమవుతాయి.

హోలీ తర్వాత  కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి?

హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే  కళ్ళకు ఉపశమనం కలిగించడానికి  సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి,  చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్‌ను చేయాలి.

 కళ్ళను శుభ్రపరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి.  తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి.

వెంటనే కళ్లు  చల్లగా కావడం కోసం  మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి.

       *రూపశ్రీ.